స్వచ్ఛమైన గాలి, పర్యావరణ పరిరక్షణ కోసం పచ్చదనాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Minister IndraKaran Reddy) అన్నారు. మహాత్మా గాంధీ జయంతి(Mahatma Gandhi Jayanthi 2021) పురస్కరించుకుని హైదరాబాద్ కొండాపూర్‌లోని బొటానికల్ గార్డెన్లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10కె, 5కె, 2కె రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి ఇంద్రకరణ్(Minister IndraKaran Reddy).. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం గార్డెన్లో మొక్కలు నాటారు.
Minister IndraKaran Reddy : 'స్వచ్ఛమైన గాలి కోసం పచ్చదనాన్ని పెంచుదాం' - Mahatma gandhi jayanthi 2021
రాష్ట్రంలో 24 శాతం ఉన్న అడవులను 33 శాతానికి పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్మాణాత్మక ప్రణాళికతో అనేక కార్యక్రమాలు చేపట్టిందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Minister IndraKaran Reddy) తెలిపారు. మహాత్మా గాంధీ జయంతి(Mahatma Gandhi Jayanthi 2021) సందర్భంగా హైదరాబాద్ బొటానికల్ గార్డెన్లో 10కె, 5కె, 2కె రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు.
Minister IndraKaran Reddy
స్వచ్ఛమైన గాలిని పెంచడానికి 24 శాతం ఉన్న అడవులను 33 శాతానికి పెంచడానికి రాష్ట్ర సర్కార్ నిర్మాణాత్మక ప్రణాళికతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి ఇంద్రకరణ్(Minister IndraKaran Reddy) తెలిపారు. బొటానికల్ గార్డెన్లో ఆరోగ్యానికి మేలు చేసే అనేక మొక్కలు ఉండటం మంచి పరిణామం అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలని సూచించారు.