ఆచార్య జయశంకర్ 86వ జయంతి సందర్భంగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నివాళి అర్పించారు. అరణ్య భవన్లో జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.ఆచార్య జయశంకర్ చిరస్మరణీయులని ఆయన చేసిన సేవలను మంత్రి స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఊపిరిగా, ప్రాణం ఉన్నంత వరకు ఉద్యమించారని కొనియాడారు.
ఆచార్య జయశంకర్ చిరస్మరణీయులు: ఇంద్రకరణ్‌రెడ్డి - ఆచార్య జయశంకర్ 86వ జయంతి వేడుకలు
రాష్ట్ర ఏర్పాటే ఊపిరిగా జీవించిన మహనీయులు ఆచార్య జయశంకర్ అని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కొనియాడారు. ఆచార్య జయశంకర్ 86వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఊపిరిగా, శ్వాస ఉన్నంత వరకు ఉద్యమించారని మంత్రి కొనియాడారు.
తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో సీఎం కేసీఆర్‌కు వెన్నంటి ఉండి రాష్ట్ర సాధనలో భాగస్వాములయ్యారని తెలిపారు. తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేశారని, జయశంకర్ స్పూర్తితో రాష్ట్ర అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి అకాంక్షించారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.శోభ, జాయింట్ సెక్రటరీ ఎం.ప్రశాంతి, పీసీసీఎఫ్‌లు లోకేశ్ జైస్వాల్, ఆర్.ఎం.డొబ్రియల్, అదనపు పీసీసీఎఫ్‌లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చూడండి:ఎమ్మెల్యే మృతికి కేసీఆర్, పోచారంతోపాటు మంత్రుల సంతాపం