Harishrao on Medical Seats: కేంద్ర ప్రభుత్వం వైద్య కళాశాలల విషయంలో రాష్ట్రంపై శీతకన్ను వేసినా.. రాష్ట్రప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవటం సంతోషకరంగా ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎంసీఆర్హెచ్ఆర్డీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ఒక్క ఏడాదే సుమారు 8 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయని అందులో 1200 మందికి కొత్తగా ఎంబీబీఎస్ సీట్లు రానున్నట్టు స్పష్టం చేశారు. ఈ కాలేజీల కోసం ప్రభుత్వం రూ.4080 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ విభాగంలో పీజీ మెడికల్ సీట్ల సంఖ్యను 613 నుంచి 1249కి పెంచామని.. ఎంబీబీఎస్‌లో ఈ ఏడాది 6500 సీట్లు భర్తీ చేయనున్నట్టు తెలిపారు.
రాబోయే రోజుల్లో ఎంబీబీఎస్ సీట్లతో పాటు పీజీ సీట్ల సంఖ్యను కూడా రెట్టింపు చేస్తామన్నారు. సీట్లు పెరిగితే మన విద్యార్థులు చైనా, రష్యా, యుక్రెయిన్, మలేషియా లాంటి దేశాలకు వెళ్లే అవసరం ఉందన్నారు హరీశ్ రావు. కాలేజీల విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి మద్దతు లేదన్నారు. గత ఏనిమిదేళ్లలో 190 కాలేజీలు కేంద్రం మంజూలు చేసినా.. వాటిలో తెలంగాణకు ఒక్కటీ రాలేదన్నారు. కేంద్రం నుంచి నిధులు అందుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. భాజపా నాయకూలకు మాటలు ఎక్కువ చేతలు తక్కువని... రాష్ట్రానికి కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని హరీశ్‌రావు ఆరోపించారు. గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.