తెలంగాణ

telangana

ETV Bharat / city

వైద్యుల మాటలే సగం రోగం నయం చేస్తాయి: హరీశ్​రావు - minister harish rao on corona deaths

వైద్యుల మాటలే సగం రోగం నయం చేస్తాయని మంత్రి హరీశ్​రావు అన్నారు. కరోనా సోకినవారు మరణిస్తారనేది అపోహ మాత్రమేనన్నారు. కొవిడ్​ బారిన పడినవారు 99 శాతం కోలుకుంటున్నట్లు తెలిపారు.

minister harishrao inaugurated covid care enter in begumpet under mahaveer hospitals
వైద్యుల మాటలే సగం రోగం నయం చేస్తాయి: హరీశ్​రావు

By

Published : Aug 3, 2020, 9:31 PM IST

కరోనాను అడ్డుకోవాలి గానీ.. బాధితులను కాదని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కొవిడ్​ కట్టడికి కృషిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్​ బేగంపేటలో జితో కొవిడ్ కేర్ సెంటర్‌ను మంత్రి హరీశ్​రావు ప్రారంభించారు. మహావీర్ ఆస్పత్రుల ఆధ్వర్యంలో పేదల కోసం ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన మహావీర్, జితో బృందానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. కరోనా వస్తే చనిపోతారనే అపోహ సరికాదని... రాష్ట్రంలో 99 శాతం మంది కొవిడ్​ నుంచి కోలుకుంటున్నారని హరీశ్​రావు వివరించారు.

కరోనా వచ్చినంతమాత్రాన ఎవరూ చనిపోరు. ఇతర జబ్బులున్నవారు, లక్షణాలు కనిపించినా.. వెంటనే ఆస్పత్రికి వెళ్లనివారికి మాత్రమే పరిస్థితి తీవ్రంగా ఉంటోంది. సమాజంలో కొంత మంది.. కరోనా బాధితులను గ్రామాల్లోకి రానివ్వకపోవడం, అపార్టుమెంట్లు నుంచి ఖాళీ చేయించడం చేస్తున్నారు. అలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. వైద్యులకు నాదో విజ్ఞప్తి...కరోనా రోగులను మరింత మానవత్వంతో చూడండి. మీరు చెప్పే మంచి మాటలే రోగిని సగం నయం చేస్తాయి.

-హరీశ్‌ రావు, మంత్రి

వైద్యుల మాటలే సగం రోగం నయం చేస్తాయి: హరీశ్​రావు

ఇవీచూడండి:ఏపీలో మరో 7822 కరోనా కేసులు నమోదు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details