Harish Rao On Bandi Sanjay Nirudyoga Deeksha: కేంద్రంలో ఖాళీగా ఉన్న ఎనిమిది లక్షలకు పైగా ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా హరీశ్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతి ఐదింటిలో ఒకటి ఖాళీగా ఉందని ఆయన పేర్కొన్నారు.
కేంద్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంగతేంటి.?: హరీశ్ రావు - harish rao tweet on central vacancies
Harish Rao On Jobs In Central: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన దీక్షపై ట్విట్టర్ ద్వారా మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు.
బండి సంజయ్‌పై హరీశ్ రావు కామెంట్స్
Harish Rao On Jobs In Central: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 8,72,243 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ 2021 జులైలో రాజ్యసభలో ప్రకటించారని హరీశ్ గుర్తు చేశారు. ఖాళీలను కేంద్రం ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. దేశం కోసం ధర్మం కోసం ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:Bandi Sanjay Nirudyoga Deeksha: 'జనవరిలోగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి... లేదంటే'