సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలతో తాగునీరు సమస్య పరిష్కారం అయిందని మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) అసెంబ్లీ సమావేశాల్లో పేర్కొన్నారు. మూడ్రోజుల విరామం అనంతరం శాసనసభ సభ సమావేశాలు (assembly sessions 2021) ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో శాసనసభ్యులు క్రాంతి కిరణ్, మహారెడ్డి భూపాల్‌రెడ్డి, మాణిక్‌రావు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానమిచ్చారు. త్వరలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు.
ఒకటి రెండు మాసాల్లోనే.. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు.. టెండర్లు పూర్తి చేసి... పనులు ప్రారంభిస్తాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యధిక సాగునీరు అందుకోనున్న నియోజకవర్గంగా నారాయణఖేడ్ నిలుస్తుంది. అతి త్వరలోనే ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు.
- హరీశ్ రావు, మంత్రి
4.97 శాతానికి పెరిగింది
తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయా ఉత్పత్తి వాటా అత్యధికంగా పెరిగిన విషయం వాస్తవమేనా అని అసెంబ్లీలో గాదరి కిషోర్ కుమార్ అడిగారు. ఆ పూర్తి వివరాలు తెలిపాలని కోరారు. దీనికి మంత్రి హరీశ్‌రావు సమాధానమిచ్చారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు జీఎస్‌డీపీ 4.06 శాతంగా ఉండేదని వెల్లడించారు. దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 4.97 శాతానికి పెరిగిందని స్పష్టం చేశారు. దేశ జీడీపీలో రాష్ట్ర వాటా పెరిగిందన్నారు.