తెలంగాణ

telangana

ETV Bharat / city

'కొవిడ్​ తర్వాత పెరిగిన బీపీ బాధితులు.. 30 ఏళ్ల వారే అధికం..' - Gleneagles Global

Harish Rao on hypertension: గ్లోబల్ హాస్పిటల్స్, కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా.. కొవిడ్ తరువాత రక్తపోటు పైన నిర్వహించిన సర్వే రిపోర్టును మంత్రి హరీశ్​రావు విడుదల చేశారు. కొవిడ్ తరువాత బీపీ బాధితులు ఎక్కువయ్యారన్న మంత్రి.. ఇందులో 30 ఏళ్ల వాళ్లే అధికంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

minister harish rao released survey report of hypertension in covid patients
minister harish rao released survey report of hypertension in covid patients

By

Published : May 17, 2022, 12:19 PM IST

Updated : May 17, 2022, 2:59 PM IST

'కొవిడ్​ తర్వాత పెరిగిన బీపీ బాధితులు.. 30 ఏళ్ల వారే అధికం..'

Harish Rao on hypertension: హైదరాబాద్​లో సుమారు 50 శాతం మంది హైపర్ టెన్షన్​ భారినపడే అవకాశం ఉందని గ్లెనిగేల్స్ గ్లోబల్ ఆస్పత్రి పేర్కొంది. జీహెచ్​ఎంసీ పరిధిలో కొవిడ్ తర్వాత హైపర్ టెన్షన్ పెరుగుదలపై కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాతో కలిపి గ్లెనిగేల్స్ గ్లోబల్ ఆస్పత్రి సర్వే చేపట్టింది. దాదాపు 5 వేల మందిపై చేసిన సర్వేలో దాదాపు 40 శాతం మందిలో హైపర్ టెన్షన్ ఉనట్టు గుర్తించారు. గతంలో జీహెచ్​ఎంసీ పరిధిలో కేవలం 25 శాతం మందిలో మాత్రమే ఈ సమస్య ఉండగా.. ఇప్పుడది 40 శాతానికి పెరగటం ఆందోళనకరంగా మారిందని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు నగరంలోని ఓ ప్రముఖ హోటల్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ చాప్టర్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ సాయి సుధాకర్, కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ చాప్టర్ డాక్టర్ రాజీవ్ గార్గ్ , గ్లెనిగేల్ గ్లోబల్ ఆస్పత్రి సీఈఓ డాక్టర్ అనురాగ్ యాదవ్, ఆస్పత్రి సీఓఓ డాక్టర్ రియాజ్ ఖాన్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

గ్లెనిగల్స్ గ్లోబల్, కార్డియోలాజికల్ సొసైటీ సర్వే ఫలితాలు బాధ కలిగిస్తున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు ఆందోళన వ్యక్తం చేశారు. గ్లోబల్ హాస్పిటల్స్, కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా కొవిడ్ తర్వాత రక్తపోటుపైన నిర్వహించిన సర్వే రిపోర్టును ఆయన విడుదల చేశారు. కొవిడ్ తర్వాత బీపీ బాధితులు ఎక్కువయ్యారన్న మంత్రి.. ఇందులో 30 ఏళ్ల వాళ్లే అధికంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీపీ బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్​సీడీ స్క్రీనింగ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు 90 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా 13 లక్షల మందిలో బీపీ ఉన్నట్టు గుర్తించామన్నారు. రానున్న 3 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 100 శాతం ఎన్​సీడీ స్క్రీనింగ్ పూర్తి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. భారత్​లో ఎన్​సీడీ స్క్రీనింగ్ చేస్తున్న మూడో రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.

"గ్లెనిగల్స్ గ్లోబల్, కార్డియోలాజికల్ సొసైటీ సర్వే ఫలితాలు బాధ కలిగిస్తున్నాయి. బీపీని కంట్రోల్ చేసుకోవడం అవసరం. బీపీ, షుగర్ ఉన్న వారిలో 60 శాతం మంది కిడ్నీ బాధితులుగా మారుతున్నారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా పని ఒత్తిడిలో ఉంటున్నారు. మొబైల్​ ఫోన్లు వచ్చాక ప్రజల జీవనవిధానం చాలా మారింది. ఆహారపు అలవాట్లు కూడా బాగా మారిపోయాయి. ఊబకాయం పెరిగింది. శారీరక శ్రమ బాగా తగ్గింది. ప్రజలకు ఉచితంగా మందులు ఇచ్చే లక్ష్యంతో ఎన్​సీడీ కిట్​ ప్రారంభించాం. కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి.. బాధితులు మందులు సరిగా వాడుతున్నారా లేదా అని తెలుసుకుంటున్నాము. ప్రతి 3 నెలలకు ఒకసారి పరీక్షలు చేసి బీపీ, షుగర్ మందుల డోస్ నిర్ణయిస్తాం. అకాల మరణాలకు బీపీ కారణం అవుతోంది. ప్రజల్లో బీపీ, షుగర్​పై అవగాహన కల్పించాల్సి ఉంది. నిత్య జీవితంలో శారీరక శ్రమ అవసరం. అందుకోసం 450 ఆయుష్​ వెల్నెస్ కేంద్రాల ద్వారా యోగా, ఫిట్​నెస్ కార్యక్రమాలు చేపట్టనున్నాం." - హరీశ్​రావు, మంత్రి

ఇవీ చూడండి:

Last Updated : May 17, 2022, 2:59 PM IST

ABOUT THE AUTHOR

...view details