హైదరాబాద్ హెచ్ఐసీసీలో క్రెడాయ్ రాష్ట్రవ్యాప్త సమావేశం ఘనంగా జరిగింది. 15 జిల్లాలకు చెందిన క్రెడాయ్ చాప్టర్ల సభ్యులు 800 మందికిపైగా కాన్‌క్లేవ్‌లో పాల్గొన్నారు. నాణ్యత, తక్కువ ధరలో నిర్మాణాల పూర్తి, నూతన సాంకేతికత అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు. మూడు దశాబ్దాలుగా నిర్మాణ రంగంలో విశేష సేవలు అందిస్తున్న మైహోం గ్రూపు సంస్థల ఛైర్మన్ జూపల్లి రామేశ్వరరావుకు... గవర్నర్ చేతులమీదుగా జీవితకాల సాఫల్య పురస్కారం అందించారు.
చిక్కులకు దూరంగా ఉండాలి..
రాష్ట్రంలో సొంతింటి కళను సాకారం చేయడంలో క్రెడాయ్ సభ్యుల కృషిని గవర్నర్ అభినందించారుయ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని, నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకుని, నాణ్యత విషయంలో రాజీపడకుండా సకాలంలో నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వం నుంచి అన్నిరకాల అనుమతులు వచ్చిన తర్వాతే నిర్మాణాలు చేపట్టి.. న్యాయపరమైన చిక్కులకు దూరంగా ఉండాలని క్రెడాయ్ ప్రతినిధులకు గవర్నర్ దిశానిర్దేశం చేశారు.
సమర్థ నాయకత్వం వల్లే..