తెలంగాణ

telangana

ETV Bharat / city

'బకాయిల చెల్లింపులతో రాష్ట్రాలకు ఊతమివ్వండి' - undefined

దిల్లీలో జరుగుతున్న 38వ జీఎస్టీ సమావేశానికి రాష్ట్రం తరఫున ఆర్థిక మంత్రి హరీశ్​రావు హాజరయ్యారు. బడ్జెట్​లో కేటాయింపుల విషయంలో పలు సూచనలు చేశారు. మిషన్​ భగీరథ, మిషన్​ కాకతీయ లాంటి పథకాలకు బడ్జెట్​లో నిధులు కేటాయించాలని తెలిపారు.

minister harish rao participated in 38th gst meeting in delhi
38వ జీఎస్టీ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్​రావు

By

Published : Dec 18, 2019, 4:11 PM IST

దిల్లీలోని ఎన్డీఎంసీ భవనంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షత 38వ జీఎస్టీ సమావేశం ప్రారంభమైంది. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ముందస్తు బడ్జెట్​ సంప్రదింపుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల అర్థిక మంత్రులు, అధికారులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి ఆర్థిక మంత్రి హరీశ్​ రావు హాజరయ్యారు.

రాష్ట్రాల సాధికారతను పెంచేలా కేటాయింపులు జరపాలని సమావేశంలో మంత్రి హరీశ్​ రావు కేంద్రానికి సూచించారు. జీఎస్టీ, ఐజీఎస్టీ బకాయిల చెల్లింపులతో రాష్ట్రాలకు ఊతమివ్వాని తెలిపారు. పన్ను చెల్లింపుదారుల కోసం ఆమ్నెస్టీ పథకం తీసుకురావాలని.. జాతీయ ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు రూ.450 కోట్లు విడుదల చేయాలన్నారు.

రాష్ట్ర పథకాలకు నిధులు కేటాయించాలి...

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకాలైన మిషన్‌ భగీరథ, మిషన్‌కాకతీయలకు నిధులను కేటాయించాలని సమావేశంలో మంత్రి హరీశ్​రావు సూచించారు. నీతిఅయోగ్ ప్రతిపాదనల మేరకు నిధులు కేటాయించాలన్నారు. మూడేళ్ల కాల వ్యవధికి మిషన్‌ భగీరథకు రూ.19,205 కోట్లు, మిషన్‌ కాకతీయకు రూ.5 వేల కోట్లు కేటాయించాలని హరీశ్​రావు తెలిపారు.

ఇవీ చూడండి : గడ్డి అన్నారంలో కార్పొరేటర్​ అనుచరుల వీరంగం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details