తెలంగాణ

telangana

ETV Bharat / city

'ప్రభుత్వ ఆస్పత్రుల్లో 3 నెలలకు సరిపడా మందులుండాలి..' - Harish Rao on gandhi hospital services

Minister Harish Rao Review: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీచింగ్ ఆస్పత్రుల పనితీరుపై మంత్రి హరీశ్​రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరోగ్య రంగంలో తెలంగాణ నంబర్​ వన్​గా నిలవాలని మంత్రి సూచించారు. ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలన్న మంత్రి... 3 నెలలకు సరిపడా మందులు ముందస్తుగానే పంపించాలని స్పష్టం చేశారు.

Minister Harish Rao on lack of medicine in government hospitals
Minister Harish Rao on lack of medicine in government hospitals

By

Published : Jun 9, 2022, 8:49 PM IST

Minister Harish Rao Review: సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు పెరిగినట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిలో ఆరోగ్య శ్రీ లబ్దిదారుల సంఖ్య 3.3రెట్లు పెరిగినట్టు వివరించారు. ఈ సందర్భంగా గాంధీ ఆస్పత్రి సిబ్బందిని మంత్రి అభినందించారు. ఈ ఏడాది జనవరిలో గాంధీ ఆస్పత్రిలో కేవలం 650 మంది ఆరోగ్య శ్రీ కింద సేవలు పొందగా.. ఫిబ్రవరిలో 1032, మార్చిలో 1277, ఏప్రిల్​లో 1653, మేలో ఏకంగా 2162 మంది లబ్దిదారులుండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పేదలకు ఉచిత వైద్యం అందించే లక్ష్యంతో అమలవుతున్న ఆరోగ్య శ్రీ సేవలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరింత విరివిగా వినియోగించుకోవాలని ప్రజలకు మంత్రి సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీచింగ్ ఆస్పత్రుల పనితీరుపై మంత్రి హరీశ్​రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేతా మహంతి, డీఎంఈ రమేశ్​రెడ్డి, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, బోధనాస్పత్రుల సూపరిండెంట్లు, హెచ్​ఓడీలు, సీనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. ఆరోగ్య రంగంలో తెలంగాణ నంబర్​ వన్​గా నిలవాలని మంత్రి సూచించారు. ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలన్నారు. ఆస్పత్రుల్లో 3 నెలలకు సరిపడా మందులు ముందస్తుగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. జనరిక్ మందులు మాత్రమే రోగులకు రాయాలని మంత్రి సూచించారు.

"వారం రోజుల్లో ప్రతీ ఆసుపత్రిలో హెల్ప్​డెస్క్ ఏర్పాటు చేయాలి. ఆస్పత్రుల్లో అవసరమైన చోట ఓపీ కౌంటర్లు పెంచాలి. ఆసుపత్రుల్లో అన్ని చోట్ల వైద్యులు ఎవరు, సూపరిడెంట్ ఎవరు, డ్రగ్ అవైలబులిటీ, స్పెషలిస్ట్ డాక్టర్లు ఎవరు అన్న వివరాలతో బోర్డులో ప్రదర్శించాలి. టీడయాగ్నసిస్ సర్వీసు, బ్లడ్ బ్యాంకు, ఎయిడ్స్ కంట్రోల్ యాక్టివీటీ, శానిటేషన్, డైట్, ఫార్మా విషయాలన్నింటిని సూపరింటెండెంటు​లు మానిటరింగ్ చేయాలి. బోధనాస్పత్రుల్లో ఫ్రొఫెసర్లు అందరూ రోజు విధులకు హాజరుకావాలి. పని ప్రదేశంలోనే నివాసం ఉండాలి. హెచ్​ఓడీలు, సీనియర్ ఫ్రొఫెసర్లు డ్యూటీ చార్ట్ ప్రకారం ఓపీలో సేవలు అందించాలి. ఔషదిని పోర్టల్​ని వినియోగించాలి. ఇక ఆస్పత్రుల్లో రిసర్చ్ కోసం సైతం తగిన నిధులు కేటాయిస్తున్నాం. పేదలకు మెరుగైన వైద్యం ఇందించేందుకు కావాల్సిన పూర్తి సహకారం ప్రభుత్వం అందిస్తుంది." - హరీశ్​రావు, మంత్రి

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details