రాష్ట్రం ఏర్పాటయ్యాక 1,49,382 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇందులో 1,17,714 ఉద్యోగ నియామకాలు పూర్తయినట్లు పేర్కొన్నారు. మిగతా ఖాళీలకు సంబంధించి కోర్టుల్లో దాదాపు 900 కేసులు ఉన్నాయని వెల్లడించారు. ఒప్పంద కార్మికుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా.. కేసుల వల్ల ఆగిపోయిందని వివరించారు. సింగరేణిలో కారుణ్య నియామకాల సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.
'ఉద్యోగ నియామకాలపై దాదాపు 900కేసులున్నాయి'
ఉద్యోగ నియామకానికి సంబంధించి దాదాపు 900 కేసులు ఉన్నాయని శాసనసభలో మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇప్పటివరకు 1,17,714 ఉద్యోగ నియామకాలు పూర్తయినట్లు చెప్పారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.
minister harish rao