Harish Rao Letter to Union Minister Mansukh Mandaviya: మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులకు యునాని, నేచురోపతి, హోమియోపతి అభ్యర్థులకూ అవకాశం కల్పించాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. ఆయుష్మాన్ భారత్ - హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులకు యునాని, నేచురోపతి, హోమియోపతి అభ్యర్థులకు సైతం అవకాశం కల్పించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఆ పోస్టుల అర్హత గురించి.. కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రికి హరీశ్‌రావు లేఖ - ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల అర్హతలు
Harish Rao Letter to Union Minister Mansukh Mandaviya: రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులకు అర్హత విషయంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. యునాని, నేచురోపతి, హోమియోపతి అభ్యర్థులకూ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమాన అర్హత ఉన్న ఇతర కోర్సులను విస్మరించడం సరికాదని లేఖలో పేర్కొన్నారు.

ప్రస్తుత నిబంధనల ప్రకారం బీఎస్సీ కమ్యూనిటీ హెల్త్ లేదా బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎంతో పాటు ఇగ్నో, మెడికల్ వర్సిటీ నుంచి ప్రత్యేక కోర్సు చేసిన ఆయుర్వేద డాక్టర్లు మాత్రమే ఎంఎల్ హెచ్‌పీ పోస్టులకు అర్హులని... ఈ నిర్ణయం మిగతా అభ్యర్థులకు నష్టం కలిగిస్తుందని హరీశ్ రావు పేర్కొన్నారు. నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి ప్రకారం బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్‌వైఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సులు కూడా మెడిసిన్ గ్రాడ్యుయేట్ కోర్సులేనన్న ఆయన... వాటి కాలవ్యవధి, అర్హత కూడా సమానమేనని స్పష్టంగా ఉందని గుర్తు చేశారు. ఆయుర్వేద అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించి, సమాన అర్హత ఉన్న ఇతర కోర్సుల అభ్యర్థులను కేంద్రం విస్మరించడం సరికాదని హరీశ్‌రావు లేఖలో తెలిపారు. నిబంధనలను సవరించాలని కోరిన మంత్రి హరీశ్... బీయూఎంఎస్, బీఎన్‌వైఎస్, బీహెచ్‌ఎంస్ పూర్తిచేసిన అభ్యర్థులకూ ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులకు అర్హత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: