తెలంగాణ

telangana

ETV Bharat / city

Vishwakarma: ప్రపంచీకరణ వల్ల నష్టపోతున్న విశ్వకర్మలను ఆదుకుంటాం: హరీశ్​రావు - విశ్వకర్మ మనుమయ సంఘం

కరీంనగర్​ హుజూరాబాద్​లో విశ్వకర్మ మనుమయ సంఘం భవన నిర్మాణానికి మాజీ స్పీకర్​ మధుసూదనాచారితో కలిసి మంత్రి హరీశ్​రావు శంకుస్థాపన చేశారు. ట్రెడీషనల్​ ఇంజినీర్స్​ ఆఫ్​ సొసైటీగా చెప్పుకునే విశ్వబ్రాహ్మణులను పైకి తీసుకొచ్చే బాధ్యత తెరాస ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు.

minister harish rao laid foundation stone to vishwakarma bhavan in huzurabad
minister harish rao laid foundation stone to vishwakarma bhavan in huzurabad

By

Published : Sep 16, 2021, 8:09 PM IST

ఆత్మగౌరవంతో బతికే విశ్మకర్మలకు ప్రపంచీకరణలో అన్యాయం జరుగుతోందని మంత్రి హరీశ్​రావు తెలిపారు. కరీంనగర్​ హుజూరాబాద్​లో విశ్వకర్మ మనుమయ సంఘం భవన నిర్మాణానికి మాజీ స్పీకర్​ మధుసూదనాచారితో కలిసి శంకుస్థాపన చేశారు. చేతివృత్తులనే నమ్ముకుని బతికే విశ్వకర్మలు.. ఈటల రాజేందర్​ ఇచ్చే డబ్బులకు అమ్ముడుపోరని స్పష్టం చేశారు. ట్రెడీషనల్​ ఇంజినీర్స్​ ఆఫ్​ సొసైటీగా చెప్పుకునే విశ్వబ్రాహ్మణులను పైకి తీసుకొచ్చే బాధ్యత తెరాస ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

నష్టపోతున్న జాతిని ఆదుకుంటాం...

"పదిహేడేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్​.. హుజూరాబాద్​ విశ్వకర్మలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. ఓ చిన్న భవనం కూడా కట్టించలేదు. ఆత్మగౌరవంతో బతికే విశ్వకర్మలు.. ఈటల రాజేందర్​ ఇచ్చే డబ్బులకు అమ్ముడుపోరు. వాళ్లకు బతుకుదెరువు కావాలి. ఫారెస్ట్​ అధికారుల నుంచి లైసెన్సులు కావాలి. వాళ్ల వృత్తికి ఓ భరోసా కావాలి. ఇప్పుడు పెద్దపెద్ద యంత్రాలు చేస్తున్న పనిని.. ఆనాడు విశ్వకర్మలు చేతులతోనే చేశారు. విశ్వకర్మలను ట్రెడీషనల్​ ఇంజినీర్స్​ ఆఫ్​ సొసైటీ అంటరు. అలాంటి గొప్ప కళాకారుల జాతికి ప్రపంచీకరణ వల్ల నష్టం జరుగుతున్న మాట వాస్తవం. విశ్వకర్మలను అన్ని విధాలా ఆదుకుంటాం." - హరీశ్​రావు, మంత్రి

ప్రపంచీకరణ వల్ల నష్టపోతున్న విశ్వకర్మలను ఆదుకుంటాం: హరీశ్​రావు

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details