తెలంగాణ

telangana

ETV Bharat / city

'భవిష్యత్‌లో ఆక్సిజన్‌ కొనుక్కునే పరిస్థితులు వస్తాయి' - harish rao latest speech

నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజాలో అఖిలభారత ఉద్యానవన ప్రదర్శనను మంత్రి హరీశ్​రావు ప్రారంభించారు. తెలంగాణ ఈవెంట్స్ ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటైన నర్సరీ మేళా ఫిబ్రవరి 1 వరకు 5 రోజులపాటు కొనసాగనుంది. 11 రాష్ట్రాలకు చెందిన 150 స్టాళ్లు కొలువుదీరాయి. రకరకాల మొక్కలతో పాటు పిచికారీ యంత్రాలు, పనిముట్లు, సేంద్రియ ఉత్పత్తులు ప్రదర్శనకు పెట్టారు.

Minister Harish Rao inaugurates All India Park Exhibition at People's Plaza, Necklace Road
'భవిష్యత్‌లో ఆక్సీజన్‌ కొనుక్కునే పరిస్థితులు వస్తాయి'

By

Published : Jan 28, 2021, 11:48 AM IST

Updated : Jan 28, 2021, 12:24 PM IST

పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్‌లో ఆక్సిజన్‌ కొనుక్కునే పరిస్థితులు వస్తాయని మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజాలో అఖిలభారత ఉద్యానవన ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. తెలంగాణ ఈవెంట్స్ ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటైన నర్సరీ మేళా ఫిబ్రవరి 1 వరకు 5 రోజులపాటు కొనసాగనుంది. 11 రాష్ట్రాలకు చెందిన 150 స్టాళ్లు కొలువుదీరాయి. రకరకాల మొక్కలతో పాటు పిచికారీ యంత్రాలు, పనిముట్లు, సేంద్రియ ఉత్పత్తులు ప్రదర్శనకు పెట్టారు. విత్తనాలు, నర్సరీ, సేంద్రియ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. సేంద్రియ వ్యవసాయంపైనా అవగాహన కల్పిస్తారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు నర్సరీ మేళాను దర్శించవచ్చు. 2015 నుంచి మేళా ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులను మంత్రి అభినందించారు. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు హరితహారం వంటి చర్యలను పెద్దఎత్తున ప్రభుత్వం చేపట్టిందని మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు.

నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజాలో అఖిలభారత ఉద్యానవన ప్రదర్శన

రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున అడవుల పునరుద్ధరణను చేపట్టింది. రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు చర్యలు చేపట్టాం. ప్రతి పట్టణంలో నర్సరీలను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే వాటర్ బాటిళ్లు కొంటున్నాం. రాబోయే రోజుల్లో ఆక్సిజన్ కూడా కొనుగోలు చేసే దుస్థితి రావచ్చు. సమాజహితం కోసం ప్రతి పౌరుడు పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వాలి. - మంత్రి హరీశ్​రావు.

ఇవీ చూడండి:'మీ ఆరోగ్య సూత్రాలు నచ్చాయ్‌.. పెళ్లి చేసుకుందామా?'

Last Updated : Jan 28, 2021, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details