రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి... కొవిడ్ నియమాలను కఠినంగా పాటించాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ డివిజన్ రాంనగర్ గుండులో ఆనంద్ ఆస్పత్రిని మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. ప్రజలంతా కరోనా మహమ్మారి వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రులు సూచించారు.
'కరోనావ్యాప్తిపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి' - ముషీరాబాద్ నియోజకవర్గం
హైదరాబాద్‌లోని ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ గుండులో మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ పర్యటించారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి ఆనంద్ ఆస్పత్రిని ప్రారంభించారు. ప్రజలంతా కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
minister harish rao inaugurated anand hospital in ramnagar gundu
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, తెరాస పార్టీ యువ నాయకులు ముఠా జై సింహ, శ్యాంసుందర్, సురేందర్, డాక్టర్ డీఎస్ రావు, డాక్టర్ సుజన, డాక్టర్ సమంతతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.