తెలంగాణ

telangana

ETV Bharat / city

కేంద్రం పెంచుకుంటూ పోతుంటే.. రాష్ట్రం దించుకుంటూ పోవాలా..: హరీశ్​రావు - telangana budget meeting news

పెట్రోల్​, డీజిల్​ ధరల పెంపుపై భాజపా నేత రాంచందర్​రావు గతంలో చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు మండిపడ్డారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తన వ్యాట్​ను తగ్గించుకోవాలని ఆయన సూచించారని... కేంద్రం పెంచుకుంటూ పోతుంటే రాష్ట్రం దించుకుంటూ పోవాలా.. అని ప్రశ్నించారు.

harish rao
కేంద్రం పెంచుకుంటూ పోతుంటే.. రాష్ట్రం దించుకుంటూ పోవాలా..:హరీశ్​రావు

By

Published : Mar 22, 2021, 5:00 PM IST

శాసనమండలిలో.. పెట్రోల్​, డిజిల్​ ధరల పెంపుపై గతంలో భాజపా ఎమ్మెల్సీ రాంచందర్​రావు.. మాట్లాడిన తీరుపై మంత్రి హరీశ్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన ధరల పెంపుతో ప్రజల మీద భారం పడుతుందని పలువురు సభ్యులు లేవనెత్తిన అంశంపై.. భాజపా సభ్యుడు రాంచందర్​రావు స్పందించారని.. రాష్ట్ర ప్రభుత్వం తన వ్యాట్​ను తగ్గించుకోవాలని సూచించారని హరీశ్​ చెప్పారు. కేంద్రం పెంచుకుంటూ పోతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం తగ్గించుకోవాలా అన్ని రాంచందర్​రావును నిలదీశారు.

భాజపా ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఈ రోజు వరకు పెట్రోల్​, డీజిల్​పైన 18 సార్లు ఎక్సైజ్​ సుంకాన్ని పెంచింది. అదే ఏడేళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం కేవలం ఒకే ఒక్కసారి సుమారు 3 శాతం పెంచింది. బాధాకరమేంటంటే.. ఎక్సైజ్​ డ్యూటీని సెస్​ రూపంలో పెంచుతున్నారు. అందువల్ల రాష్ట్రానికి రావాల్సిన వాటా రాకుండా పోతోంది. 2014లో పెట్రోల్​పైన 9.2 శాతం సెస్​ ఉంటే ఈరోజు 32.98 శాతానికి పెంచారు. డిజిల్​పైన 3.46 శాతం నుంచి 31.83 శాతానికి పెంచారు. అంటే పదింతలు పెరిగింది. దీనిపై భాజపా నేత రాంచందర్​రావు.. ఓ ఉచిత సలహా ఇచ్చారు. మేం పెంచుకుంటూ పోతాం.. మీరు దించుకుంటూ పోండి అంటున్నారు. అంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగొద్దా. సంక్షేమం ఉండొద్దా. తెలంగాణలో నిధులు ఉండొద్దనా మీ ఉద్దేశం. ఈ వైఖరి చారా దురదృష్టకరం.

- హరీశ్​రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి

కేంద్రం పెంచుకుంటూ పోతుంటే.. రాష్ట్రం దించుకుంటూ పోవాలా..:హరీశ్​రావు

ఇవీచూడండి:మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణలోనే అద్భుతంగా..: హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details