'అమరుల గురించి మాట్లాడే నైతికత కిషన్‌రెడ్డికి ఉందా?' Harish Rao on Kishan Reddy: తెలంగాణ అమరుల ఆత్మగౌరవాన్ని భాజపా నేతలు దెబ్బతీస్తున్నారని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. జై ఆంధ్రా ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని ప్రకటించిన కిషన్‌రెడ్డికి.. అమరుల గురించి మాట్లాడే నైతికత ఉందా.. అని ప్రశ్నించారు. కేసీఆర్ మాట్లాడేది ప్రజల భాష అని అభివర్ణించిన మంత్రి.. భాష గురించి మాట్లాడే హక్కు కిషన్‌రెడ్డికి లేదని మండిపడ్డారు. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు అయినా మీరు తెచ్చారా? అని నిలదీశారు. మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.364 కోట్లు ఇస్తే.. కేంద్రం కేవలం రెండున్నర కోట్లు మాత్రమే ఇచ్చిందని దుయ్యబట్టారు.
కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలి..
"జై ఆంధ్రా ఉద్యమానికి నాయకత్వం వహిస్తా అని కిషన్‌రెడ్డి గతంలో ట్వీట్ చేశాడు. తెలంగాణ వచ్చింది కాబట్టే కిషన్‌రెడ్డి ఇప్పుడు కేంద్రమంత్రి అయ్యాడు. రాష్ట్ర ఏర్పాటును పార్లమెంట్‌లో అమిత్ షా బ్లాక్ డేగా అభివర్ణించారు. అమరుల గురించి మాట్లాడే నైతికత కిషన్‌రెడ్డికి ఉందా? తెలంగాణ అమరుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. భాష గురించి మాట్లాడే హక్కు కిషన్‌రెడ్డికి లేదు. కేసీఆర్ మాట్లాడేది ప్రజల భాష. ఎఫ్‌సీఐకి బడ్జెట్‌లో రూ.65 వేల కోట్లు కోత పెట్టారు. ఉపాధి హామీకి రూ.25 వేల కోట్లు తగ్గించారు. వీటన్నింటిపై కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలి. రైతులపై సహచర మంత్రి కారు ఎక్కించి చంపితే మాట్లాడలేదు. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు రిజర్వేషన్ పెరగాలని కేసీఆర్ కోరారు హైదరాబాద్‌కు వరదలు వస్తే మీరు నిధులేమైనా ఇప్పించారా? తెలంగాణకు ఒక్క ట్రిపుల్ ఐటీ ఇవ్వలేదు. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు అయినా తెచ్చారా? మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.364 కోట్లు ఇచ్చింది. కేంద్రం ఇచ్చింది కేవలం రూ.2.5 కోట్లు మాత్రమే."- హరీశ్‌రావు, మంత్రి
ఇదీ చూడండి: