Harish Rao Fire on Doctors: వైద్యులు పనితీరు మెరుగుపర్చుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మందలించారు. హైదరాబాద్‌లోని నార్సింగ్ యూపీహెచ్సీ ప్రాంగణంలో తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్‌ని ప్రారంభించిన మంత్రి... వైద్యుల పనితీరును పర్యవేక్షించారు. రోగుల ఓపీ రికార్డులను చూడాలని కోరగా.. వైద్యుల నుంచి సరైన స్ఫందన రాకపోవటంతో వైద్య సిబ్బందిపై మండిపడ్డారు.
వైద్యసిబ్బందిపై మంత్రి హరీశ్‌రావు ఫైర్.. తీరుమార్చుకోవాలని వార్నింగ్.. - నార్సింగ్ యూపీహెచ్సీ
Harish Rao Fire on Doctors: నార్సింగ్ యూపీహెచ్సీ వైద్య సిబ్బందిపై మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఓపీ సేవలపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి.. పని తీరు మెరుగుపర్చుకోవాలని మందలించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఆస్పత్రిలో ఆరుగురు వైద్యులు సహా మొత్తం 30 మందికి పైగా సిబ్బంది ఉన్నా.. ఓపీ సేవలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి ఆస్పత్రుల్లో అన్ని సదుపాయాలు అందుబాటులోకి తీసుకొస్తుంటే.. తాము మాత్రం ఎలాంటి బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. మెరుగైన పనితీరు కనబరిస్తేనే ప్రజల్లో నమ్మకం ఏర్పడి.. సర్కారు దవాఖానాలకు వస్తారని సూచించారు. రోగుల ఓపీ రికార్డులు తప్పక మెయింటెన్ చేయాలని హరీశ్ రావు సూచించారు. రికార్డులు సరిగా లేకపోవటాన్ని తీవ్రంగా పరిగణించిన మంత్రి.. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇవీ చూడండి: