Harish Rao Comments: కాళేశ్వరంపై కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేసిన వ్యాఖ్యలను మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. కేంద్రానికి నచ్చితే నీతి.. నచ్చకపోతే అవినీతా? అని మంత్రి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ తప్పులను తెరాస ప్రభుత్వం ఎత్తిచూపుతూ.. వాస్తవాలను ప్రజల ముందు ఉంచడం వల్లే అసత్య ప్రచారం చేస్తున్నారని హరీశ్ ఆరోపించారు. రాజకీయాల కోసం తెరాసపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. పార్లమెంటులో అవినీతి జరగలేదని చెప్పి.. వెంటనే ప్రెస్‌మీట్ పెట్టి అవినీతి జరిగిందని చెప్పారని విమర్శించారు. ప్రకృతి వైపరీత్యం వల్ల 108 మీటర్ల భారీ వరదలు వచ్చాయన్నారు. గోదావరి నది చరిత్రలో ఎప్పుడూ రానీ విధంగా వరద వచ్చిందన్నారు. రెండు పంప్‌హౌస్‌ల్లోకి నీళ్లు వచ్చాయని.. ఐదేళ్లలో ప్రాజెక్టుకు ఏ సమస్య వచ్చినా ఏజెన్సీ చూసుకుంటుందని స్పష్టం చేశారు.
కేంద్రానికి నచ్చితే నీతి, నచ్చకపోతే అవినీతా అంటూ ప్రశ్నించిన హరీశ్ - కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి
Harish Rao Comments కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేసిన వ్యాఖ్యలను మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వ తప్పులను తెరాస ప్రభుత్వం ఎత్తిచూపుతూ వాస్తవాలను ప్రజల ముందు ఉంచడం వల్లే అసత్య ప్రచారం చేస్తున్నారని హరీశ్ ఆరోపించారు.
"కేంద్రానికి నచ్చితే నీతి.. నచ్చకపోతే అవినీతా? కాళేశ్వరం ప్రాజెక్టును మసూద్ హుస్సేన్ అభినందించారు. కేంద్ర ప్రభుత్వ తప్పులను తెరాస ప్రభుత్వం ఎత్తిచూపుతుంది. వాస్తవాలను ప్రజల ముందు ఉంచడం వల్లే అసత్య ప్రచారం చేస్తున్నారు. రాజకీయాల కోసం తెరాసపై బురద జల్లుతున్నారు. పార్లమెంటులో అవినీతి జరగలేదని చెప్పారు. ప్రెస్‌మీట్ పెట్టి అవినీతి జరిగిందని చెప్పారు. 1986లో గోదావరిలో అతిపెద్ద వరద వచ్చింది. ఇప్పుడు కూడా ప్రకృతి వైపరీత్యం వల్ల భారీగా వరదలు వచ్చాయి. గతంలో 107.05 మీటర్లు వస్తే.. ప్రస్తుతం 108 మీటర్ల వరద వచ్చింది. కేంద్రప్రభుత్వ సంస్థనే డీపీఆర్ తయారు చేసింది. గోదావరి నది చరిత్రలో ఎప్పుడూ రానీ విధంగా వరద వచ్చింది. రెండు పంప్‌హౌస్‌ల్లోకి నీళ్లు వచ్చాయి. ఐదేళ్లలో ప్రాజెక్టుకు ఏ సమస్య వచ్చినా ఏజెన్సీ చూసుకుంటుంది." - హరీశ్‌రావు, మంత్రి
ఇదీ చూడండి: