సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన హరీష్రావు జిల్లాలోని అంగడిపేట అనే గ్రామంలో రోడ్డు పక్కన నర్సమ్మ అనే మహిళతో మాట కలిపారు. గ్రామంలో పరిస్థితి, కరోనా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగారు. కూరగాయలు, నిత్యావసరాలు దొరుకుతున్నాయా అని వాకబు చేశారు. పొదుపు సంఘాల వాయిదాలు కట్టడం ఇబ్బందిగా ఉందని నర్సమ్మ.. మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అధికారులతో మాట్లాడి మూడు నెలలు గడువు ఇప్పిస్తా అని మంత్రి మాటిచ్చారు.
మహిళతో మంత్రి హరీశ్ ముచ్చట.. పరిస్థితులపై వాకబు
కరోనా కట్టడి నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రి హరీష్రావు సంగారెడ్డి జిల్లాలోని అంగడిపేట గ్రామంలో రోడ్డు పక్కన ఆగి ఓ మహిళతో ముచ్చటించారు.
మహిళతో మంత్రి ముచ్చట.. గ్రామంలో పరిస్థితుల గురించి వాకబు
లాక్డౌన్ వల్ల చేతిల పనుల లేక ఇబ్బంది అవుతుందని పలువురు గ్రామస్థులు, మహిళలు మంత్రికి చెప్పుకొన్నారు. స్పందించిన మంత్రి త్వరలో ఉపాధి హామీ పనులు ప్రారంభిస్తామన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రూ.1500 ఖాతాల్లో వేస్తున్నామని, ప్రజలంతా దూరం పాటించాలని హరీష్ రావు చెప్పారు. నర్సమ్మతో మంత్రి పెట్టిన ముచ్చట సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.