Harishrao On Sirivennela: వ్యాపార ప్రధానమైన సినీరంగంలో సమాజాన్ని తట్టిలేపే పాటల్ని రాసిన ఘనత సిరివెన్నెల సీతారామశాస్త్రికే దక్కుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఫిలింఛాంబర్‌లో సిరివెన్నెల భౌతికకాయానికి హరీశ్ నివాళి అర్పించారు. సినిమా పాటల్లో సిరివెన్నెలది ప్రత్యేక స్థానమని... అశ్లీల, ద్వంద్వార్థాలు లేని పాటలు రాసిన గొప్ప రచయిత అని కొనియాడారు.
Talasani On Sirivennela: సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వ్యాఖ్యానించారు. దాదాపు 800 చిత్రాలకు 3 వేలకు పైగా పాటలు రాశారన్నారు. సిరివెన్నెల పాటల్లో చక్కని తెలుగు, కమ్మదనం ఉంటుందన్నారు. 11 సార్లు నంది అవార్డులు, పద్మశ్రీ అందుకోవడం చాలా గొప్ప విషయమని తెలిపారు. కొత్తతరం గీత రచయితలు సిరివెన్నెలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సిరివెన్నెల పార్థివదేహానికి తలసాని నివాళి అర్పించారు. సిరివెన్నెల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిరివెన్నెల మరణం ఆయన కుటుంబానికే కాకుండా యావత్ తెలుగు జాతికి తీరని లోటన్నారు.