రాష్ట్రంలో సమస్యలు లేవు అని చెప్పడానికి శాసనసభ జరుగుతున్న తీరే నిదర్శనమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరును యావత్ దేశం హర్షిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర నీటి ప్రాజెక్టులను నీతిఆయోగ్, సీడబ్ల్యూసీ ప్రశంసించిందని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును చూసి అప్పటి గవర్నర్ నరసింహన్, ఇప్పటి గవర్నర్ తమిళిసై అబ్బురపడ్డారని మంత్రి పేర్కొన్నారు.
'జలాశయాలు, పచ్చని పొలాలు మా పని తీరుకు సాక్ష్యాలు'
ప్రాజెక్ట్ పనులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దుతామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును యావత్ దేశం హర్షిస్తోందని అన్నారు. అందరూ అభినందిస్తోంటే కాంగ్రెస్ నేతలకు నిద్ర రావడం లేదని విమర్శించారు.
harish rao
రైతు సంక్షేమమే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పని చేస్తోందని హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో నిండిన జలాశయాలు, గలగల పారుతున్న కాలువలు, ఈ యాసంగిలో 38 లక్షల ఎకరాల్లో పచ్చని పొలాలు ఇందుకు సాక్ష్యామని వివరించారు. అన్ని ఎన్నికల్లోనూ తెరాసను గెలిపిస్తూ సీఎం కేసీఆర్ను రైతన్నలు దీవిస్తున్నారని మంత్రి తెలిపారు.