కరోనా ప్రభావంతో దేశీయ విమానయాన మార్కెట్ 15 నుంచి 20 శాతం తగ్గిందని.. ఈ పరిస్థితిని త్వరలోనే అధిగమిస్తామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలియజేశారు. హైదరాబాద్ బేగంపేట విమానానాశ్రయంలో జరుగుతోన్న వింగ్స్ ఇండియా - 2020 ఏవియేషన్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ రంగంపై కరోనా ప్రభావం, భవిష్యత్తుపై మాట్లాడారు. వైమానిక ఇంధన ధరలను పదిహేను రోజులకోసారి సమీక్షించేలా కేంద్రాన్ని కోరతామన్నారు.
'కరోనా దెబ్బకు 20శాతం తగ్గిన విమానయాన రంగ మార్కెట్' - hardeep singh commented on corona effect on aviation
కరోనా ప్రభావంతో దేశీయ విమానయాన మార్కెట్ 20 శాతం తగ్గిందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ఈ పరిస్థితిని త్వరలోనే అధిగమిస్తామన్నారు. బేగంపేట విమానాశ్రయంలో నిర్వహిస్తోన్న వింగ్స్ ఇండియా-2020 ఏవియేషన్ సదస్సుకు ఆయన హాజరయ్యారు. కరోనాపై భయాందోళనలు వద్దని.. సరైన జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చని తెలిపారు.

భవిష్యత్ అవసరాలు, విమానయాన సామర్థ్యం పెంచుకోవడం, కొత్త ఎయిర్ లైన్స్ నిర్వహణకు ప్రస్తుతమున్న ఎయిర్పోర్టులతో పాటు.. గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలను అనుసంధానించి.. రద్దీగా ఉండే ప్రధాన ఎయిర్ పోర్టులపై భారం తగ్గిస్తామని హర్దీప్ సింగ్ తెలిపారు. ఎంఆర్వో ఫెసిలిటీలలో వంద శాతం ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని.. ఎయిర్ ఇండియా విక్రయం ద్వారానే దాని మనుగడ, భవితవ్యం దాగున్నాయన్నారు. కరోనాపై భయాందోళనలు వద్దని.. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ మహమ్మారిని పారదోలచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇవీచూడండి:కరోనాను విపత్తుగా ప్రకటన- మృతుల కుటుంబాలకు పరిహారం