ఈఎస్ఐ కుంభకోణంలో తన కుమారుడిపై ఏపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను మంత్రి జయరామ్ ఖండించారు. తన కుమారుడి పేరిట బెంజ్ కారు ఉన్నట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. బెంజ్ కారుకు, తమకు ఎలాంటి సంబంధం లేదన్న ఆయన... తన కుమారుడికి ఏపీవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని చెప్పారు. అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు.
'ఆరోపణలు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా' - ఏపీ ఈఎస్ఐ స్కాం తాజా వార్తలు
ఏపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను ఆ రాష్ట్ర మంత్రి జయరామ్ కొట్టిపారేశారు. తన కుమారుడికి బెంజ్ కారుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆరోపణలు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.
'ఆరోపణలు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా'