ఏపీ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్వగ్రామమైన కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం గుమ్మనూరులో ఉద్రిక్తత నెలకొంది. పేకాట రాయుళ్లను పట్టుకునేందుకు మఫ్టీలో వెళ్లిన పోలీసులపై దాడి చేశారు కొందరు వ్యక్తులు.
ఏపీ: మంత్రి జయరాం స్వగ్రామంలో పోలీసులపై దాడి - minister gummanur jayaram followers attack on police news
పేకాట ఆడేవారిని పట్టుకునేందుకు మఫ్టీలో వెళ్లిన పోలీసులపై దాడి జరిగింది. తాము మంత్రి అనుచరులమంటూ కొందరు వ్యక్తులు పోలీసులను చితకబాదారు. ఈ ఘటన ఏపీ మంత్రి జయరాం స్వగ్రామంలోనే జరిగింది.
గుమ్మనూరులో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ప్రత్యేక పోలీసు బృందం ఆ గ్రామానికి వెళ్లింది. పేకాట స్థావరానికి వెళ్లిన వారిపై పేకాట రాయుళ్లు దాడి చేశారు. 'మేము మంత్రి జయరాం అనుచరులం... మమ్మల్నే అరెస్టు చేస్తారా?' అంటూ చితకబాదారు. ఘటనలో ఎస్సై సమీర్ బాషాకు గాయాలయ్యాయి. దీనికి సంబంధించి 33 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరికొందరు పేకాటరాయుళ్లు పరారయ్యారు. 40 వాహనాలు, 5,44,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చూడండి:భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు