ఈ ఏడాది డిసెంబరులో... ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నైపుణ్య విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయనున్నట్టు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 20 నైపుణ్యాభివృద్ధి కళాశాలలకు భూకేటాయింపు ప్రక్రియ పూర్తైందని ఆయన తెలిపారు. సచివాలయంలో పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్షించారు.
'డిసెంబర్లో... తిరుపతి నైపుణ్యాభివృద్ధి వర్సిటీకి శంకుస్థాపన' - గౌతమ్ రెడ్డి లెటెస్ట్ న్యూస్
డిసెంబర్లో...తిరుపతి నైపుణ్య విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయనున్నట్టు ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. తిరుపతి నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయంతో పాటు ఇతర జిల్లాలో ఏర్పాటుచేయనున్న నైపుణాభివృద్ధి కళాశాలల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నవంబర్ 15 నాటికి సమగ్ర పరిశ్రమ సర్వేను పూర్తిచేయాలని మంత్రి సూచించారు.

'డిసెంబర్లో... తిరుపతి నైపుణ్యాభివృద్ధి వర్సిటీకి శంకుస్థాపన'
తిరుపతిలో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయంతో పాటు విశాఖ, చిత్తూరు, ఏలూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో నైపుణ్య కళాశాలలను ప్రారంభించేందుకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన నిధుల సమీకరణపై మంత్రి చర్చించారు. నవంబరు 15 నాటికి సమగ్ర పరిశ్రమ సర్వేను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
ఇదీ చదవండి:పెళ్లిచేసుకోమన్నందుకు యువతిపై కత్తితో దాడి.. ఇద్దరు అరెస్ట్