బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం తక్షణమే టెండర్లు పిలవాలని అధికారులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి బీసీ సంక్షేమశాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలు, ఆత్మ గౌరవ భవనాల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు.
Bc welfare : బీసీ ఆత్మగౌరవ భవనాలకు త్వరలోనే టెండర్లు - telangana bc welfare minister gangula kamalakar
సీఎం కేసీఆర్ బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన కోకాపేట, ఉప్పల్ భగాయత్‌లో కేటాయించిన స్థలాల్లో బీసీ ఉపకులాలకు ఆత్మగౌరవ భవన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని మంత్రి గంగుల ఆదేశించారు. నాణ్యతతో కూడిన ప్రపంచ స్థాయి శాశ్వత భవనాల నిర్మాణం కోసం తక్షణమే టెండర్లు పిలవాలని చెప్పారు.
కోకాపేటలో హెచ్ఎండీఏ మౌలిక వసతులను అభివృద్ధి చేసిందని, ఉప్పల్ భగాయత్‌లో కూడా అభివృద్ధి చేయాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్‌కు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నారని, అవసరమైన నిధులు అందుబాటులో ఉంచారని తెలిపారు. బీసీలకు అందాల్సిన సంక్షేమ పథకాలపై సమీక్షలో మంత్రి గంగుల చర్చించారు.