తెలంగాణ

telangana

ETV Bharat / city

కల్యాణలక్ష్మి పథకానికి రూ. 675 కోట్లు విడుదల: గంగుల - minister gangula kamalakar talks in kalyana Lakshmi scheme

కల్యాణలక్ష్మి పథకం పురోగతిని ఇకనుంచి రెవెన్యూ డివిజన్ల వారీగా సమీక్షిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ పథకం అమలుపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు.

minister gangula kamalakar review meeting on kalyana Lakshmi scheme
కల్యాణలక్ష్మి పథకానికి రూ. 675 కోట్లు విడుదల: గంగుల

By

Published : Jul 16, 2020, 7:21 AM IST

కల్యాణలక్ష్మి పథకం నిరుపేద కుటుంబాలకు వరంలా మారిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ పథకం పురోగతిని ఇక నుంచి రెవెన్యూ డివిజన్ల వారీగా సమీక్షిస్తామని తెలిపారు. హైదరాబాద్​లోని తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు.

కల్యాణలక్ష్మి కోసం రూ.675 కోట్లు విడుదల చేసినట్లు గంగుల తెలిపారు. 2016 నుంచి 2019 వరకు ఉన్న బకాయిల కోసం 44.11కోట్లు, 2019-20, 2020-21 సంవత్సరాల లబ్ధిదారులకు రూ. 591.35 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. నిధులు విడుదలైన నేపథ్యంలో... వాటిని లబ్దిదారులకు త్వరగా అందించాలని ఆర్డీఓలకు మంత్రి సూచించారు.

ఇదీ చూడండి:'ర్యాపిడ్ యాంటీజె‌న్ టెస్టు ఎవరు... ఎప్పుడు చేయించుకోవాలి?

ABOUT THE AUTHOR

...view details