తెలంగాణ

telangana

ETV Bharat / city

పోలవరం సవరించిన అంచనాలు అధ్యయనం చేయాలి: కేంద్రమంత్రి - polavaram project latest news

పోలవరం సవరించిన అంచనాలను ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని కేంద్ర జల్‌శక్తి మంత్రి రాజ్యసభలో స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల సమస్యేమీ లేదన్న ఆయన.. ఏపీ ప్రభుత్వం ఆర్అండ్ఆర్ సమస్యపై దృష్టి పెడితే పనులు వేగంగా పూర్తవుతాయని ప్రకటించారు.

minister-gajendra-singh-shekhawat-on-polavaram-project-in-parliament-budget-sessions
పోలవరం సవరించిన అంచనాలు అధ్యయనం చేయాలి: కేంద్రమంత్రి

By

Published : Feb 8, 2021, 9:35 PM IST

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. సవరించిన అంచనాలను ఎప్పుడు ఆమోదిస్తారో చెప్పాలని కేంద్ర జల్‌శక్తి మంత్రిని అడిగారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2,500కోట్ల రూపాయలు తన సొంత నిధులను ఖర్చు చేసిందని తెలిపారు.

వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి

దీనిపై స్పందించిన కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్.. 2013-14 ధరల ప్రకారం ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని.. ధరలు పెంచేందుకు అవకాశం లేదని విభజన చట్టంలో పేర్కొన్నట్లు వివరించారు. అయితే పెరిగిన ధరలపై నిపుణుల కమిటీ ఇచ్చిన సవరించిన అంచనాలను ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్

ప్రాజెక్టు నిర్మాణానికి రివాల్వింగ్‌ ఫండ్ ఏర్పాటు చేయాలని విజయసాయిరెడ్డి కోరారు. ఇలా చేస్తే నిధుల సమస్య ఉండదని.. అనుకున్న సమయానికి ప్రాజెక్టు నిర్మించే అవకాశం ఉంటుందన్నారు. దీనిపైనా స్పందించిన మంత్రి షెకావత్‌.. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి నిధుల సమస్య లేదన్నారు.

ఇదీ చదవండి:మంత్రి కేటీఆర్​ను సెల్ఫీ కోరిన వృద్ధురాలు

ABOUT THE AUTHOR

...view details