ఎన్పీసీఐ డేటా కేంద్రానికి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్ - హైదరాబాద్లో ఎన్పీసీఐ డేటా కేంద్రం
16:52 July 02
ఎన్పీసీఐ డేటా కేంద్రానికి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న డేటాకేంద్రానికి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రిటైల్ లావాదేవీలు, డిజిటల్ పేమెంట్ల కోసం ఎన్పీసీఐ అంతర్జాతీయ డేటా కేంద్రం ప్రమాణాలతో రూ.500 కోట్లతో నార్సింగిలో స్మార్ట్ డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇది హైదరాబాద్లో మొదటి టైర్ ఫోర్ డేటా కేంద్రం. డిజిటల్ ఇండియాలో భాగంగా స్మార్ట్ డేటా కేంద్రాన్ని ఎన్పీసీఐ అభివృద్ధి చేయనుంది. నెలకు 4 వేల మిలియన్ల సంఖ్యలో రూ.15 లక్షల కోట్ల వరకు డిజిటల్ చెల్లింపుల ప్రాసెసింగ్లో డేటా కేంద్రం కీలకం కానుందని తెలిపింది.
భూకంపాలు, తుపాన్ల వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి భద్రతా ప్రమాణాలతో పూర్తి పర్యావరణహితంగా డేటా కేంద్రం నిర్మాణం చేయనున్నారు. ఎనిమిదంచెల భద్రతతో ఐఓటీ ఆధారిత భవన నిర్వహణా వ్యవస్థతో రూపుదిద్దుకోనుంది. డేటా కేంద్రానికి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్కు కార్పొరేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. డిజిటల్ లావాదేవీలను మరింతగా ప్రోత్సహించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి :మార్కెట్లోకి సరికొత్త ఛాలెంజ్... ఇది పర్యావరణహితమండోయ్..!