"కొత్త" వైరస్ ప్రాణాంతకమేమీ కాదు.. కానీ..: మంత్రి ఈటల - కరోనా స్ట్రెయిన్‌పై ఈటల సమీక్ష

16:14 December 29
యూకే స్ట్రెయిన్ ప్రాణాంతకం కాదు: మంత్రి ఈటల
యూకే స్ట్రెయిన్ ప్రాణాంతకం కాదని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కొత్త స్ట్రెయిన్ వేగంగా వ్యాపిస్తుందని నిపుణులు చెప్తున్నారని పేర్కొన్నారు. చలికాలం దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అన్ని ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో మంత్రి ఈటల సమావేశమయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతుల కల్పనపై సమీక్షించారు. కరోనా కొత్త స్ట్రెయిన్‌ను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై వైద్యులతో ఈటల చర్చించారు.
ఇదీ చదవండి :రాష్ట్రంలో యూకే వైరస్ కలకలం... ఆరోగ్యశాఖ అప్రమత్తం