తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎంతైనా ఖర్చు పెడతాం.. ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాం: ఈటల

ఇతర రాష్ట్రాలతో పోల్చితో తెలంగాణలో మరణాలు రేటు 0.6 శాతం మాత్రమే ఉందని మంత్రి ఈటల స్పష్టం చేశారు. మండలిలో ప్రశ్నత్తరాల సందర్భంగా ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి అడిగిన ప్రశ్నలకు ఈటల సమాధానమిచ్చారు.

ఎంతైనా ఖర్చు పెడతాం.. ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాం: ఈటల
ఎంతైనా ఖర్చు పెడతాం.. ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాం: ఈటల

By

Published : Sep 9, 2020, 11:57 AM IST

కరోనా దెబ్బకి అగ్రరాజ్యాలు సైతం అతలాకుతలమయ్యాయని మంత్రి ఈటల తెలిపారు. నూటికి 81 శాతం మంది ఎలాంటి లక్షణాలు లెకున్నా పాజిటివ్​ వస్తుందని ఈటల పునరుద్ఘాటించారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా తగ్గిపోతుందని స్పష్టం చేశారు. పాజివిట్ వచ్చిందని ఆందోళన చెందుతున్న వారి కోసం కిట్లను కూడా అందజేస్తున్నామన్నారు. 1,42,000 మందికి అన్ని రకాల మందులు ఇచ్చే అవసరం లేదని ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబు ఇచ్చారు. వైరస్ కారణంగా ఊపిరితిత్తులు ఇబ్బంది అవుతున్న మాట వాస్తవమే అని.. వారందరికి వెంటిలేటర్​పై చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ఈ స్థాయిలో 5 నుంచి 10 శాతం మంది కూడా కొలుకున్న సందర్భాలు లేవని చెప్పారు.

ప్రజలకు ప్రభుత్వం నుంచి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం. కరోనాకు తొలి మందు ధైర్యమే. అనేక మంది సహచరులకు మేము కొల్పోయాం. రెండో మందు మన చుట్టుపక్కన ఉండే వారు ఇచ్చే భరోసా. మూడోది ప్రభుత్వం ఇచ్చేది కిట్లు, నాలుగోది ఆక్సిజన్​, వెంటిలేటర్లు. తెలంగాణలో 0.6శాతం మాత్రమే మరణాలు రేటు ఉంది. ఎంతైనా ఖర్చు పెడతాం.. ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాం - ఈటల రాజేందర్​, వైద్యారోగ్య శాఖ మంత్రి.

ఎంతైనా ఖర్చు పెడతాం.. ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాం: ఈటల

ఇవీ చూడండి:శాసనసభలో స్పీకర్‌తో విపక్షాల వాగ్వాదం

ABOUT THE AUTHOR

...view details