ప్రధానమంత్రి సడక్ యోజన కింద రాష్ట్రంలో వెయ్యి కిలోమీటర్ల రోడ్డు పనుల కోసం రూ. 620 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రాష్ట్ట్రానికి మూడో విడత కింద కేటాయించిన 2,427 కిలోమీటర్లలో మరో 1427 కిలోమీటర్లకు కూడా అనుమతుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను అదేశించారు. పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి ఈ మేరకు సమీక్షా సమావేశం నిర్వహించారు.
వెయ్యి కి.మీ రోడ్డు పనులకు నిధుల విడుదల : ఎర్రబెల్లి - MINISTER ERRABELLI REVIEW MEETING IN PMSY FUNDS
ప్రధానమంత్రి సడక్ యోజన కింద రాష్ట్రంలో వెయ్యి కిలోమీటర్ల పనుల కోసం రూ.620 కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక అనుమతి ఇచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
![వెయ్యి కి.మీ రోడ్డు పనులకు నిధుల విడుదల : ఎర్రబెల్లి MINISTER ERRABELLI REVIEW MEETING IN PMSY FUNDS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6842805-987-6842805-1587204276351.jpg)
వెయ్యి కి.మీ రోడ్డు పనులకు నిధులు విడుదల : మంత్రి ఎర్రబెల్లి
లాక్డౌన్ సమయంలో ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో 6 లక్షల మంది పని చేస్తున్నారని, మరో వారం రోజుల్లో ఈ సంఖ్య పది లక్షలకు చేరుతుందని మంత్రి తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు, పంచాయితీల్లోని పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ వాతావరణం కల్పించాలని, మాస్కులు, మంచినీరు అందిచాలని, భౌతిక దూరం పాటిస్తూ ఉపాధి పనులు చేసుకునేలా చూడాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి:రోగికి సాయం కోసం బైక్పై 430కి.మీ ప్రయాణం
Last Updated : Apr 18, 2020, 4:28 PM IST