రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వ్యవసాయేతర భూములకు సంబంధించిన రికార్డులను పకడ్బందీగా తయారు చేయాలని, ప్రతి ఇంచూ ఆన్లైన్లో నమోదు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. వ్యవసాయేతర ఆస్తుల ఆన్లైన్ నమోదు నేపథ్యంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రామాల్లోని ప్రతి ఇళ్లు, అంగుళాన్ని ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు.
'ప్రతీ అంగుళాన్ని ఆన్లైన్లో నమోదు చేయాలి' - online records
వ్యవసాయేతర ఆస్తుల ఆన్లైన్ నమోదు నేపథ్యంలో ఉన్నతాధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రామాల్లోని ప్రతి ఇళ్లు, అంగుళాన్ని ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. ఈ విషయమై ప్రజల్లో చైతన్యం కల్పించాలని అధికారులకు సూచించారు.
ఆస్తులకు భద్రత కల్పించటమే కాకుండా ఆయా భూ, ఇళ్ల యజమానులకు భరోసానివ్వాలన్నదే సీఎం లక్ష్యమని ఎర్రబెల్లి తెలిపారు. అందుకు అనుగుణంగా గ్రామాల్లోని ప్రతి ఇల్లు, ఇతర నిర్మాణాల వివరాలు, వ్యవసాయ క్షేత్రాల్లోని ఇళ్లు, తదితరాలన్నింటినీ పూర్తిగా ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. ఎలాంటి లోపాలు లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలన్న మంత్రి... ప్రజల్లో ఏవైనా అనుమానాలు, అపోహలు ఉంటే తొలగించాలని చెప్పారు.
దళారులు, ఇతరులెవరికీ డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదన్న విషయాన్ని... ఆన్లైన్ ప్రక్రియ పూర్తి ఉచితంగా జరుగుతుందని ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు ఎర్రబెల్లి సూచించారు.