తెలంగాణ

telangana

ETV Bharat / city

'హైదరాబాద్​లో వ్యాక్సిన్​ తయారు కావడం గర్వంగా ఉంది'

వేల కోట్లు ఖర్చుపెట్టి ప్రభుత్వాలు కొవిడ్​ వ్యాక్సిన్​ను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ వెల్లడించారు. హైదరాబాద్​లో వ్యాక్సిన్​ తయారు కావడం గర్వంగా ఉందన్నారు.

'హైదరాబాద్​లో వ్యాక్సిన్​ తయారు కావడం గర్వంగా ఉంది'
'హైదరాబాద్​లో వ్యాక్సిన్​ తయారు కావడం గర్వంగా ఉంది'

By

Published : Jan 9, 2021, 7:23 PM IST

రాష్ట్రంలోని హైదరాబాద్​లో వ్యాక్సిన్ తయారు కావడం గర్వంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. చందానగర్​లోని పీఆర్​కే ఆస్పత్రిలో కొవిడ్​ వ్యాక్సిన్ డ్రైరన్ కేంద్రాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​తో కలిసి ఆయన ప్రారంభించారు. దాదాపు సంవత్సరం నుంచి కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలను వణికిస్తోందని మంత్రి ఈటల అన్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రభుత్వాలు కరోనా వ్యాక్సిన్​ను అందుబాటులోకి తెచ్చేందుకు అహర్నిశలు పోరాడుతున్నాయని తెలిపారు.

మొదటగా 2లక్షల 90 వేల మంది వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న వారికి వ్యాక్సిన్ అందించనున్నామని మంత్రి వెల్లడించారు. 800 పైచిలుకు కేంద్రాల్లో వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. 50 ఏళ్లకు మించిన పెద్దవారితో పాటు చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు 10 వేల మందికి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.

ఇవీ చూడండి: జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్​ షురూ

ABOUT THE AUTHOR

...view details