ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వికారాబాద్‌లో నిర్మిస్తున్న 60పడకల ఆసుపత్రి భవనాన్ని చేవెళ్ల ఎంపీ రంజీత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం ఎంపీ రంజీత్ రెడ్డి అందజేసిన అంబులెన్స్‌ను మంత్రి ప్రారంభించారు.జిల్లా కేంద్రమైన వికారాబాద్‌లో అన్ని సౌకర్యాలతో ఆసుపత్రి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్య అందించడమే ప్రభుత్వం లక్ష్యం: ఈటల - అంబులెన్స్ ప్రారంభించిన మంత్రి ఈటల రాజేందర్
వికారాబాద్‌లో నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. అనంతరం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యాక్రమంలో భాగంగా ఎంపీ రంజిత్ రెడ్డి అందించిన అంబులెన్స్‌ను మంత్రి ప్రారంభించారు.
![ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్య అందించడమే ప్రభుత్వం లక్ష్యం: ఈటల minister eetala rajendar visitation hospital building in vikarabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9564529-thumbnail-3x2-etala.jpg)
ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్య అందించడమే ప్రభుత్వం లక్ష్యం: ఈటల
ప్రతి ఆసుపత్రిలో అందరు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, అందుకు కావాల్సిన నియామకాలు చెపడుతున్నట్టు మంత్రి వెల్లడించారు. ఆపద సమయంలో సత్వర వైద్యం అందజేయడం కోసం గీఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక అంబులెన్స్ అందుబాటులోకీ తీసుకొస్తున్నామని... ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్య అందించడమే ప్రభుత్వం లక్ష్యం: ఈటల