నాణ్యమైన విద్య, వైద్యం పొందటం ప్రజల హక్కు అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్‌లో నేషనల్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అసోషియేషన్ తెలంగాణ చాప్టర్‌ను మంత్రి ప్రారంభించారు. హెల్త్‌కేర్ రంగానికి కేంద్రం బడ్జెట్ పెంచాలని విజ్ఞప్తి చేశారు. అందుబాటులో ఉన్న మెడిసిన్‌ను ప్రజలకు అందించటమే తమ కర్తవ్యమన్నారు.
నాణ్యమైన విద్య, వైద్యం పొందటం ప్రజల హక్కు: ఈటల - నేషనల్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్ ప్రారంభం
అందుబాటులో ఉన్న మెడిసిన్‌ను ప్రజలకు అందించటమే తమ కర్తవ్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నాణ్యమైన విద్య, వైద్యం పొందటం ప్రజల హక్కు అని పేర్కొన్నారు.
![నాణ్యమైన విద్య, వైద్యం పొందటం ప్రజల హక్కు: ఈటల నాణ్యమైన విద్య, వైద్యం పొందటం ప్రజల హక్కు: ఈటల](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10447583-thumbnail-3x2-eta.jpg)
నాణ్యమైన విద్య, వైద్యం పొందటం ప్రజల హక్కు: ఈటల
శాస్త్ర విజ్ఞానం పెరిగిందే కానీ ప్రజలకు తక్కువ ధరకు వైద్యం అందటం లేదని మంత్రి విచారం వ్యక్తం చేశారు. మెరుగైన వైద్యసేవలు తక్కవ ధరలో అందాలనేదే తమ ఆకాంక్ష అన్నారు. కొవిడ్ సందర్భంగా ఆయుష్ వైద్యానికి గుర్తింపు తేవాలని కేంద్రం చెప్పినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, తదితరులు పాల్గొన్నారు.
Last Updated : Jan 31, 2021, 4:20 PM IST
TAGGED:
eetala rajendar opened nima