తెలంగాణ

telangana

ETV Bharat / city

నాణ్యమైన వైద్యం అందిస్తేనే ప్రేమాభినాలు పొందుతారు: ఈటల - కొండాపూర్​లో ఆసుపత్రిన ప్రారంభించిన మంత్రి ఈటల

హైదరాబాద్​ కొండాపూర్​లో హెల్త్​వ్యాలీ ఆసుపత్రిని మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించనప్పుడే ప్రేమాభిమానాలు పొందుతారని మంత్రి అన్నారు. సామాన్యులకు కూడా మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆసుపత్రిని ఏర్పాటు చేసిన వైద్యులను అభినందించారు.

minister eetala rajendar opened helath valley hospital in kondapur
నాణ్యమైన వైద్యం అందిస్తేనే ప్రేమాభినాలు పొందుతారు: ఈటల

By

Published : Nov 22, 2020, 4:27 AM IST

పేదలకు నాణ్యమైన వైద్యం అందించినప్పుడే ప్రజల ప్రేమాభిమానాలు వైద్యులు పొందుతారని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. హైదారాబాద్​ కొండాపూర్​లో హెల్త్​వ్యాలీ ఆసుపత్రిని ఈటల ప్రారంభించారు. సామాన్యులకు సైతం అత్యున్నత ప్రమాణాలు కలిగిన వైద్యం అందించాలనే లక్ష్యంతో యూకేలో శిక్షణ పొందిన ప్రసాద్, గీతాదేవి... ఇక్కడ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

ఇక్కడ అత్యున్నత శ్రేణి నర్సింగ్‌ కేర్‌తో పాటు... ఆర్థోపెడిక్స్‌, జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సెంటర్‌, స్పోర్ట్స్‌ గాయాలు, ఆర్థోస్కోపీ, ట్రామా కేర్‌, గైనకాలజీ, ఫెర్టిలిటీ వంటి సేవలు అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ప్రపంచ శ్రేణి ఐసీయూ, క్రిటికల్‌ కేర్‌, ఫిజియోథెరఫీ, రీహాబిలిటేషన్‌, ఇంటర్నల్‌ మెడిసన్‌, డయాబెటాలజీ, ల్యాప్రోస్కోపిక్‌ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ, పిడియాట్రిక్స్‌ సేవలు కూడా అందుబాటులో ఉన్నట్టు వెల్లడించారు. 100 పడకల ఆస్పత్రిలో సైంట్రలైజ్డ్‌ ఏసీ, ఆక్సిజన్‌ సరఫరా సదుపాయాలు ఉన్నాయి. ధనిక, పేద తేడా లేకుండా అందరికీ సమానమైన రీతిలో వైద్యసేవలను అందించాలన్నది తమ లక్ష్యమని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:టీకా పంపిణీ కోసం అందుబాటులోకి కొవిన్​ యాప్​

ABOUT THE AUTHOR

...view details