రాష్ట్రంలో ఆగస్టు, నవంబర్ మాసాల్లో కారోనా కేసులు పతాకస్థాయికి చేరే అవకాశం ఉందని... యూనివర్సిటీ ఆఫ్ చికాగో ప్రొఫెసర్ డాక్టర్ విజయ్ ఎల్దండి పేర్కొన్నారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో... మంత్రి ఈటల రాజేందర్‌తో డాక్టర్ విజయ్ భేటీ అయ్యారు. కారోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు. జ్వరం, కారోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని, ఎప్పటికప్పుడు శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను గమనించుకోవాలని డాక్టర్ విజయ్ సూచించారు. సరైన మాస్క్ లను ధరించడం, పరిశుభ్రత ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్ పాల్గొన్నారు.
యూనివర్సిటీ ఆఫ్ చికాగో ప్రొఫెసర్‌తో ఈటల భేటీ - చికాగో యూనివర్సిటీ ప్రొఫెసర్‌తో మంత్రి ఈటల భేటీ
యూనివర్సిటీ ఆఫ్ చికాగో ప్రొఫెసర్ డాక్టర్ విజయ్‌తో... మంత్రి ఈటల రాజేంద్ర్ భేటీ అయ్యారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంత్రి వివరించారు.
యూనివర్సిటీ ఆఫ్ చికాగో ప్రొఫెసర్‌తో ఈటల భేటీ