తెలంగాణ

telangana

ETV Bharat / city

Minister dharmana: కార్యకర్త అత్యుత్సాహం.. చేయి చేసుకున్న మంత్రి - శ్రీకాకుళం జిల్లా లేటెస్ట్ అప్​డేట్స్

Minister Dharmana: వైకాపా కార్యకర్తపై ఏపీ రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేయిచేసుకున్నారు. ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీపడిన కార్యకర్తల్లో ఒకరు మంత్రి చేయిపట్టి గట్టిగా లాగడంతో కార్యకర్తపై చేయి చేసుకున్నారు.

Minister dharmana
ఏపీ రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు

By

Published : Apr 16, 2022, 10:54 PM IST

Minister Dharmana: ఏపీలో కొత్తగా రెవెన్యూశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా శ్రీకాకుళం వచ్చిన ధర్మాన ప్రసాదరావును కలిసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆయనతో కరచాలనం చేసేందుకు కార్యకర్తలు పోటీపడ్డారు. ఈ సమయంలో ఓ అభిమాని ఆయన చేతిని గట్టిగా లాగడంతో అసౌకర్యానిక గురైన మంత్రి వైకాపా కార్యకర్తపై చేయి చేసుకున్నారు.

కార్యకర్త అత్యుత్సాహం.. చేయి చేసుకున్న మంత్రి
ఇదీ చదవండి:ఈనెల 27న తెరాస వ్యవస్థాపక దినోత్సవం.. జాతీయ పార్టీ పెడతారా?

ABOUT THE AUTHOR

...view details