తెలంగాణ

telangana

ETV Bharat / city

'విశాఖ రాజధాని కోసం అవసరమైతే మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం '

ఏపీలో విశాఖ రాజధాని కోసం అవసరమైతే రాజీనామా చేస్తానని ఆ రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాద్ అన్నారు. ముఖ్యమంత్రి అనుమతిస్తే తన పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చేందుకు సిద్ధమని ధర్మాన స్పష్టం చేశారు. నారా చంద్ర‌బాబు తెలివిగా త‌న‌దైన రాజ‌కీయం చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే వచ్చే నష్టం ఏంటని ప్రతిపక్షాలను ప్రశ్నించారు.

Minister Dharmana Prasad
Minister Dharmana Prasad

By

Published : Oct 7, 2022, 8:03 PM IST

ముఖ్యమంత్రి జగన్ అనుమతిస్తే తన పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చేందుకు సిద్ధమని ఆ రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ రాజధాని కోసం అవసరమైతే రాజీనామా చేస్తానన్నారు. ఉమ్మ‌డి ఆంధ్రప్ర‌దేశ్ విడిపోయిన అనంతరం రాష్ట్రానికి రాజధాని వెతుక్కోవాల్సి వచ్చిందన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్​కు రాజ‌ధాని ఏ విధంగా ఉండాలని చెబుతూనే ఆ విధంగా ఆనాడు ప‌లు క‌మిటీలు తెర‌పైకి వచ్చాయన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని ఆ రోజు కేంద్రం నియమించిన క‌మిటీలు తెలియజేశారని ధర్మాన అన్నారు. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే వచ్చే నష్టం ఏంటని ప్రతిపక్షాలను ప్రశ్నించారు.

'రాజధాని కోసం అవసరమైతే మంత్రి పదవికి రాజీనామ చేయడానికి సిద్దం'

శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలులో నూత‌నంగా ఏర్పాట‌ైన వ్య‌వ‌సాయ మార్కెట్ క‌మిటీ కార్య‌వ‌ర్గాన్ని రెవెన్యూ శాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద రావు అభినందించారు. ఏఎంసీ కార్యాల‌యం వ‌ద్ద ఏర్పాటు చేసిన కార్య‌క్రమంలో ధర్మాన ముఖ్యఅతిథిగా మంత్రి పాల్గొన్నారు. స‌మ‌ర్థంగా ప‌నిచేసి ప్ర‌భుత్వానికి మంచి పేరు తీసుకురావాల‌ని ఆకాంక్షించారు. గ‌తిలేని వాడు వ్య‌వ‌సాయం చేసే ప‌రిస్థితి నేడు ఏర్పడిందన్నారు. దేశంలో 65 శాతం మంది వ్యవసాయంపై ఆధార పడుతున్నారన్నా మంత్రి.. కొద్ది మంది ఆదాయాల‌ను ఎక్కువ మందికి పంచ‌డం సాధ్యం కాదని చెప్పారు.

వ్యవసాయ రంగంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్​లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదటి స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో రైతుకు పండించే పంటకు గిట్టుబాటు ధర నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వమన్న మంత్రి.. నేడు రైతులు పండించే పంటకు అయ్యే పెట్టుబడి దృష్ట్యా ధాన్యం బస్తా ధర మూడు వేల రూపాయలకు ఉండాలని.. కానీ కేవలం రూ.1500లకు మాత్రమే అమ్ముడు పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details