AP 10th Supply results : ఏపీలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలో 64.23 శాతం ఉత్తీర్ణత లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,91,846 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1,23,231 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 60.83 శాతం, బాలికలకు 68.76 శాతం ఉత్తీర్ణత లభించింది. అత్యధికంగా ప్రకాశం జిల్లా 87.52%, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లా 46.66% ఉత్తీర్ణత సాధించింది.
AP 10th Supply results : 'పది' సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. బాలికలదే హవా - AP SSC supply results today
AP 10th Supply results : ఏపీలో పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1,91,846 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1,23,231 మంది ఉత్తీర్ణత సాధించారు.
"పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు బాగా నిర్వహించినందుకు శాఖాపరంగా గర్విస్తున్నాం. పాఠశాలల విలీన ప్రక్రియలో శాసనసభ్యుల అభిప్రాయం తీసుకుంటున్నాం. పిల్లలు గొప్పవాళ్లు కావాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. గొప్పవాళ్లు కావాలనుకోవాలనుకునేవారు.. స్కూల్ పక్కనే ఉండాలని కోరుకోకూడదు. పాఠశాలల విలీనం జరగలేదు.. తరగతుల విలీనమే జరిగింది. రాబోయే తరాల భవిష్యత్తు కోసమే విలీనం నిర్ణయం తీసుకున్నాము. ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి సహకరించాలి. ఏ కార్యక్రమమైనా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని చేపడతాం. భేషజాలకు పోకుండా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. సంయుక్త కలెక్టర్లు ఆధ్వర్యంలో కమిటీ నివేదిక వస్తుంది.. దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటాము" -బొత్స సత్యనారాయణ, ఏపీ విద్యాశాఖ మంత్రి