Botsa on Face Recognition App ఉపాధ్యాయ సమస్యలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాల చర్చలు విఫలమయ్యాయి. ముఖ్యంగా సొంత సెల్‌ఫోన్లలో ముఖ ఆధారిత హాజరు యాప్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు ససేమిరా అన్నారు. తమ ఫోన్‌లో ఉన్న వ్యక్తిగత సమాచారం లీకయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే అందరికీ మొబైల్ ఫోన్లు ఇవ్వాలనే లేకపోతే పాఠశాల వద్దే మౌఖిక హాజరకు సంబంధించిన పరికరాలు ఏర్పాటు చేయాలని కోరారు.
హాజరు, ఆలస్యం విషయంలో పాత నిబంధనలే ఉంటాయి. మంచి లక్ష్యానికి ఉపాధ్యాయులు సహకరించాలి. మిగతా విభాగాల్లోనూ ఇదే విధానం అమల్లోకి రావొచ్చు. సెల్‌ఫోన్లు ఉద్యోగులదా, ప్రభుత్వం ఇస్తుందా అనేది ఆయా శాఖలు నిర్ణయం తీసుకుంటాయి. ముఖ ఆధారిత హాజరు యాప్‌పై సమన్వయలోపం ఉంది. -మంత్రి బొత్స సత్యనారాయణ, ఏపీ విద్యాశాఖమంత్రి