three capitals botsa comments: ఏపీలో ముమ్మాటికీ పాలనా వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానమని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. 13 జిల్లాల్లో అభివృద్ధి జరగాలనేది తమ లక్ష్యమన్నారు. శివరామకృష్ణ కమిషన్ కూడా వికేంద్రీకరణను సూచించిందని వెల్లడించారు. ప్రతిపక్ష నేతల అభిప్రాయాలు తమ ప్రభుత్వానికి ప్రామాణికం కాదని పునరుద్ఘాటించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం స్వార్థం కోసం పోలవరాన్ని, ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టిందని విమర్శించారు.
"ముమ్మాటికీ వికేంద్రీకరణే మా ప్రభుత్వ విధానం. ప్రతిపక్షం అభిప్రాయాలు మాకు ప్రామాణికం కాదు. 13జిల్లాల్లో అభివృద్ధి జరగాలనేది మా లక్ష్యం. శివరామకృష్ణ కమిషన్ కూడా వికేంద్రీకరణను సూచించింది."-బొత్స సత్యనారాయణ, పురపాలకశాఖ మంత్రి
జిల్లాల పునర్విభజనపై వస్తున్న విజ్ఞప్తులను కమిటి పరిశీలిస్తోందని తెలిపారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కానుందని మంత్రి బొత్స వెల్లడించారు.