సీఆర్డీఏ స్థానంలో 'అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ'ని ఏర్పాటు చేసేందుకు ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఈ బిల్లును పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. సీఆర్డీఏకు సంబంధించిన ఆస్తులు, అప్పులు అన్నీ ఏఎంఆర్డీఏకు బదలాయింపు చేస్తూ ప్రభుత్వం ప్రతిపాదన చేసింది.
సీఆర్డీఏను రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీలో బిల్లు
సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ శాసనసభలో ఏపీ ప్రభుత్వం కొత్త బిల్లు ప్రవేశపెట్టింది. సీఆర్డీఏ స్థానంలో 'అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ'ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది.
bosta satyanarayana
భూ సమీకరణ విధానంలో అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు... పట్టా భూములు ఇచ్చిన రైతులతో సమానమైన ప్లాట్లను ఇవ్వాలని ప్రతిపాదించింది. రాజధాని ప్రాంతంలో రైతుల కౌలును మరో ఐదేళ్లు పొడిగించాలని... భూములు లేని కూలీలకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ను రూ.5వేలకు పెంచాలని బిల్లులో పేర్కొంది.
ఇదీ చూడండి:'అన్ని ప్రాంతాల అభివృద్ధికే పరిపాలన వికేంద్రీకరణ'