తెలంగాణ

telangana

ETV Bharat / city

ap minister anil kumar on nani : 'కొడాలి నాని తప్ప మాకు ఏ నానీ తెలియదు'

ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు తగ్గించి ప్రేక్షకుల్ని అవమానిస్తున్నారంటూ హీరో నాని చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర మంత్రి స్పందించారు. తమకు ఏ నానీలూ తెలీదని తెలిసిందల్లా కొడాలి నానీ మాత్రమేనని అన్నారు.

ap minister anil kumar on nani, minister anil kumar yadav comments
హీరో నానిపై అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలు

By

Published : Dec 24, 2021, 1:12 PM IST

హీరో నానిపై అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలు తగ్గించి ప్రేక్షకుల్ని అవమానిస్తున్నారంటూ సినీ హీరో నాని చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ప్రభుత్వం సినిమా టికెట్ ధరలు తగ్గించడాన్ని ప్రజలు హర్షిస్తుంటే సినిమా హీరోలకు కడుపు మంట ఎందుకని అన్నారు. సినిమా హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకుని ఆ ప్రయోజనాల్ని ప్రేక్షకులకు బదిలీ చేయాలని ఆయన పేర్కొన్నారు. తమకు ఏ నానీలూ తెలీదని తెలిసిందల్లా కొడాలి నానీ మాత్రమేనని అన్నారు.

సినిమా పరిశ్రమలో జరిగే దోపిడీని అరికట్టేందుకే వైకాపా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. సినిమా ప్రొడక్షన్ ఖర్చు 30 శాతమైతే... సినిమా హీరోల రెమ్యూనరేషన్ 70 శాతం ఉంటోందని ఆయన అన్నారు. గతంలో సినీ ఫ్యాన్స్​గా కటౌట్లు కట్టి తానూ నష్టపోయానని ఇప్పుడు అసలు వాస్తవం తెలిసివస్తోందని వ్యాఖ్యానించారు.

కొడాలి నాని తప్ప మాకు ఏ నానీ తెలియదు. సినీ పరిశ్రమలో దోపిడీ అరికట్టేందుకే చర్యలు. సినిమా ఖర్చులో 70 శాతం హీరోల రెమ్యునరేషనే ఉంటోంది. హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవచ్చు కదా?. హీరోలు రెమ్యునరేషన్ తగ్గిస్తే సినిమా టికెట్ల ధర తగ్గుతుంది. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు హర్షిస్తుంటే హీరోలకు కడుపుమంట ఎందుకు?. సినిమా అభిమానిగా కటౌట్లు కట్టి నేనూ నష్టపోయాను.

- ఏపీ మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్

Nani about AP Tickets issue: ఏపీ సినిమా టికెట్ల విషయమై హీరో నాని గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్​ రేట్లను తగ్గించడం ప్రేక్షకులను అవమానించినట్లేనని అన్నారు.


"(టికెట్ రేట్లు విషయంలో) ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది కరెక్ట్​ కాదు. అది మనందరికీ తెలుసు. రేపే (డిసెంబర్ 24) సినిమా రిలీజ్​ కాబట్టి, ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదమే అవుతుంది. సినిమాలు, రాజకీయాలను పక్కనపెడితే.. మీరు ప్రేక్షకులను అవమానపరుస్తున్నారు. 10 మందికి ఉద్యోగం ఇచ్చే థియేటర్​ కంటే పక్కనే ఉన్న కిరాణా కొట్టు కలెక్షన్ ఎక్కువగా ఉంటోంది. టికెట్ ధరలు పెంచినా.. కొని సినిమా చూసే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది."

-నాని, హీరో

'శ్యామ్​ సింగరాయ్' కోసం ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి పనిచేశారని నాని చెప్పారు. ఈ సినిమా క్రియేట్ చేయబోయే ఇంపాక్ట్​తో.. ప్రేక్షకులు ఒక ప్రత్యేకమైన​ హ్యాంగ్​ఓవర్​తో ఇంటికెళ్తారని అన్నారు. ఇక తన పేరు ముందు 'నేచురల్ స్టార్'​ అనే పదాన్ని తీసేద్దామనుకుంటున్న తెలిపారు. రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో.. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు.


ఇదీ చూడండి:Pushpa: వసూళ్లలో తగ్గేదే లే.. యూఎస్​ఏలో 'పుష్ప' రికార్డు

ABOUT THE AUTHOR

...view details