ఆర్డీఎస్ (RDS) కుడి కాలువ నిర్మాణం సక్రమమే అని ఏపీకి చెందిన మంత్రి అనిల్ కుమార్ (Minister Anil Kumar) స్పష్టం చేశారు. కుడి కాలువపై తెలంగాణది అనవసర రాద్ధాంతమని వ్యాఖ్యానించారు. తెలంగాణ మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. వైఎస్‌పై చేసిన వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరును సస్యశ్యామలం చేసేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి (cm jagan) కృషి చేస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే పోతిరెడ్డిపాడును వెడల్పు చేసేందుకు కార్యాచరణ చేపడుతున్నామని స్పష్టం చేశారు.
RDS Controversy: 'సీమ ప్రాజెక్టులపై తెలంగాణ మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు' - rayalaseema lift irrigation
రాయలసీమ ప్రాజెక్టులపై తెలంగాణ మంత్రులు ఇష్టమెుచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రి అనిల్ కుమార్(Minister Anil Kumar) ఆక్షేపించారు. వైఎస్‌పై చేసిన వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణం సక్రమమే అన్న ఆయన.. తెలంగాణది అనవసర రాద్ధాంతమని వ్యాఖ్యానించారు.
ఆర్‌డీఎస్ కుడికాలువ నిర్మాణం సక్రమమే: మంత్రి అనిల్
'అపెక్స్ కౌన్సిల్‌లో తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశాం. మా హక్కుగా రావాల్సిన నీటి వాటానే వాడుకుంటున్నాం. మేం అక్రమంగా ఎలాంటి ప్రాజెక్టులూ కట్టడం లేదు. పాలమూరు, డిండి, కల్వకుర్తి ప్రాజెక్టులు అక్రమంగా కట్టినవే. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై కేంద్ర అపెక్స్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేశాం. జల సమస్యలను సామరస్యంగానే పరిష్కరించుకుంటాం' - అనిల్ కుమార్, ఏపీ రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి
ఇదీ చదవండి:Attack: సర్పంచ్ భర్తకు దేహశుద్ధి.. అక్కడే అసలు ట్విస్ట్..