MINISTER AMBATI: ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలంలో పర్యటించారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీల పారిశుద్ధ్య పనులను పట్టించుకోవడం లేదని ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమ్మఒడి, డ్వాక్రాలకు లంచం అడుగుతున్నారని.. మేము ఎక్కడినుంచి తీసుకురావాలంటూ ఆమె ధ్వజమెత్తారు.
అమ్మఒడికి లంచం అడుగుతున్నారు.. మంత్రి అంబటి ఎదుట మహిళ ఆగ్రహం - ఏపీ వార్తలు
MINISTER AMBATI: ఆంధ్రప్రదేశ్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబుకు నిరసన సెగ తగిలింది. రోడ్లు, మురుగుకాలువలు, పారిశుద్ధ్యం గురించి పట్టించుకోవడం లేదంటూ స్థానిక మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమ్మఒడి మంజూరు చేయడానికి అధికారులు లంచం అడుగుతున్నారని మంత్రి అంబటిని నిలదీసింది.
MINISTER AMBATI
బాధితురాలు చెప్పిన విషయాలను విన్న మంత్రి అంబటి.. అన్నీ వివరాలను కాగితంపై రాసి ఇవ్వాలని కోరారు. ఓ గంటపాటు తాను గ్రామంలోనే పర్యటిస్తానని.. న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: