Minister Ambati Rambabu Comments on volunteers: 'వాలంటీర్లంతా.. వైకాపా కార్యకర్తలు, పార్టీకి సమాచారం చేరవేసే సైనికులు' అంటూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో జరిగిన వైకాపా జిల్లాస్థాయి ప్లీనరీ సమావేశంలో మంత్రి అంబటి మాట్లాడారు. 'వాలంటీర్లు ఎవరు ?, వాళ్లను ఎవరు పెట్టారు అంటే.. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు పెట్టారు.
వాలంటీర్లు ఎవరు? జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే వాలంటీర్లను నియమించాం. వాలంటీర్లందరూ కూడా మనం చెప్పినవాళ్లే. వాలంటీర్స్ వైకాపా కార్యకర్తలు. పార్టీకి వ్యతిరేకంగా వాలంటీర్లు మాట్లాడితే తీసేస్తాం. - అంబటి, ఏపీ మంత్రి
గ్రామాల్లో మీరు చెబితేనే పెట్టాం. అవసరమైతే తీసేస్తాం. తప్పు చేస్తే చెప్పండి. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే తీసేస్తాం. మళ్లీ కొత్తవాళ్లను వేసేస్తాం. వాలంటీర్లు అందరూ కూడా మీరు చెబితేనే వచ్చినవాళ్లు. వారంతా వైకాపాకు కార్యకర్తలు. ప్రతి విషయాన్ని ఇంటింటికి చేరవేసే సైనికులు. మీ నాయకత్వంలో గ్రామాల్లో వాళ్లను గ్రిప్‌లో పెట్టుకుని ముందుకెళ్లండి' అంటూ సమావేశంలో మంత్రి అంబటి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.