తెలంగాణ

telangana

ETV Bharat / city

3 రాజధానులే రెఫరెండంగా 2024 ఎన్నికలకు వెళ్తాం: అమర్‌నాథ్‌ - మూడు రాజధానులే రిఫరెండం

Minister Amarnath on 3 Capitals: ఆంధ్రప్రదేశ్‌లో 3 రాజధానులే రెఫరెండంగా 2024 ఎన్నికలకు వెళ్తామని ఆ రాష్ట్ర మంత్రి అమర్‌నాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల ఫలితాలతో రాజధానుల అంశంపై వివాదానికి తెరదించుతామన్నారు.

3 రాజధానులే రెఫరెండంగా 2024 ఎన్నికలకు వెళ్తాం: అమర్‌నాథ్‌
3 రాజధానులే రెఫరెండంగా 2024 ఎన్నికలకు వెళ్తాం: అమర్‌నాథ్‌

By

Published : Sep 13, 2022, 7:56 PM IST

3 రాజధానులే రెఫరెండంగా 2024 ఎన్నికలకు వెళ్తాం: అమర్‌నాథ్‌

Minister Amarnath on 3 Capitals: ఏపీలో అమరావతి రైతులది ఉత్తరాంధ్రపై దండయాత్ర అని ఆ రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మా ప్రాంతానికి వచ్చి.. మా పొట్ట కొట్టాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అమరావతి రైతులపై ఉత్తరాంధ్ర ప్రజలు దాడులు చేయొచ్చని.. ఏం జరిగినా దానికి చంద్రబాబుదే బాధ్యత అని పునరుద్ఘాటించారు. 2024 ఎన్నికల ఫలితాలతో.. రాజధానుల అంశంపై వివాదానికి తెరదించుతామని మంత్రి అన్నారు. పరిపాలన, హామీలు అమలు చేసిన విధానాలు, రాజధానిపై పార్టీ వైఖరికి.. 2024 ఎన్నికలు రెఫరెండం అవుతాయని మంత్రి అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు.

ఇవీ చదవండి..:

ABOUT THE AUTHOR

...view details